ఈ నెల 23 నుంచి గ్రామాల్లో ఉచిత NCD స్క్రీనింగ్

ఈ నెల 23 నుంచి గ్రామాల్లో ఉచిత NCD స్క్రీనింగ్

VKB: ఈ నెల 23 నుంచి 26 వరకు కుల్కచర్ల మండలంలోని గ్రామాల్లో ఉచిత NCD స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. వైద్య సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి బీపీ, షుగర్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్ వంటి వ్యాధులపై పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ ప్రజలు ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకుని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.