మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు
విశాఖ మెడికల్ కాలేజీలపై ఈడీ గురువారం దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా గాయత్రి మెడికల్ కాలేజీలో తనిఖీలు జరిపింది. కాలేజీకు సంబంధించిన పలు కీలక డాకుమెంట్లను అధికారులు పరిశీలించారు. మెడికల్ సీట్ల కేటాయింపులు, పలు అంశాలపై కళాశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.