'బెల్సారి రాంపూర్ రోడ్డు మార్గాన్ని బాగు చేయండి'
ADB: భీంపూర్ మండలంలోని గోన గ్రామం నుంచి బెల్సారి రాంపూర్, అందర్ బంద్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా గుంతల మయంగా మారింది. రోడ్డు మార్గం అధ్వాన్నంగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని వాహనదారులు వాపోయారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా ఉందన్నారు. రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.