'భారీ వర్షాలకు నిండి పారుతున్న కోట్ పల్లి ప్రాజెక్ట్'

VKB: కోట్ పల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో చుట్టుపక్కల కాలువలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని SP నారాయణరెడ్డి తెలిపారు. గురువారం ప్రాజెక్టు నిండి పారుతుండడంతో పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.