అంగన్వాడీ టీచర్లకు 5జీ మొబైల్స్ పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు 5జీ మొబైల్స్ పంపిణీ

KRNL: ఆలూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు 5జీ మొబైల్ ఫోన్లు అందజేశారు. వీటి ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని ఆమె తెలిపారు. డిజిటల్ సేవల వినియోగంతో పిల్లల పోషణ, ఆరోగ్య వివరాల నమోదు సులభమవుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.