గణపవరంలో 2.81 లక్షల నగదు పట్టివేత

ప.గో: సార్వత్రిక ఎన్నికలల్లో భాగంగా గణపవరంలో బుధవారం రూ.2.81 లక్షలు నగదు పట్టుకున్నారు. దొరికిన నగదుకి సరైన పత్రాలు చూపించని కారణంగా సీజ్ చేసి ట్రెజరీకి పంపించామని రిటర్నింగ్ అధికారి ఖాజావలి పేర్కొన్నారు. ఉప్పుటూరు నియోజవర్గంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నామన్నారు. రూ. 50,000 పైబడి నగదుతో ప్రయాణించేవారు తగిన ఆధారాలను వెంట ఉంచుకోవాలన్నారు.