ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ SAగా పనిచేస్తున్న SD. ఖలీల్ పాషాను DEO ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. హాజరు రిజిస్టర్ తారుమారు, పాఠశాలకు హాజరు కాకపోవడం వంటి ఆరోపణలపై ఇటీవల విచారణ జరిగింది. టీచర్ల మధ్య గొడవలపై త్రీ మెన్ కమిటీ నివేదికను కలెక్టర్‌కు అందించగా, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు.