రేపు హిందూ సమ్మేళన సమావేశం
SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరగనున్న హిందూ సమ్మేళనానికి స్థానిక ఎస్‌ఐ సౌజన్యను కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఉత్సవ చైర్మన్, సర్పంచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆమెను కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించాలని కోరారు. సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.