VIDEO: మహానంది క్షేత్రంలో వివాహాల సందడి

NDL: మహానంది క్షేత్రం వివాహాల సందడి, భక్తజనులతో కళకళలాడుతోంది. ఆదివారం వివాహాలకు శుభదినం కావడంతో పదుల సంఖ్యలో వివాహాలు జరిగాయి. పలు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానం ఆచరించి శ్రీ కామేశ్వరీ సమేత మహానందిశ్వర స్వామిని దర్శించుకున్నారు.