వర్షాలపై సీఎం స్టాలిన్ సమీక్ష
దిత్వా తుఫాన్ ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో సబ్‌వేలు మూసివేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో వర్షాలపై సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలకు ఆదేశాలు జారీ చేశారు.