VIDEO: విరిగిన కరెంటు స్తంభం... తప్పిన పెను ప్రమాదం

SKLM: వజ్రపు కొత్తూరు మండలం ధర్మపురం గ్రామ సమీప మలుపు వద్ద ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కరెంటు స్తంభం విరిగి రోడ్డుకు ఒకవైపు ప్రమాదకర రీతిలో వాలింది. అటుగా వెళ్లిన వాహనదారులు గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మరమ్మత్తులు చేపట్టారు.