తిరుపతి వాసులకు 2,111 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ!
తిరుపతి శెట్టిపల్లెలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపింది. నేడు సంక్రాంతి కానుకగా 2,111 మంది లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూమిని పేదలకు అందజేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ప్రభుత్వం మినహాయించింది.