'రింగింగ్ చేసుకుని సంబరాలా?'

'రింగింగ్ చేసుకుని సంబరాలా?'

E.G: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో రింగింగ్ చేసుకుని గెలిచిన కూటమి నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఓడిస్తారనే భయంతో పోలీసులతో అండతో దౌర్జన్యాలకు దిగారని ఆరోపించారు.