చొరబాటుదారులు తగ్గాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి: షా
బెంగాల్‌లో 15 ఏళ్లుగా శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. TMC ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల సిలిగుడి కారిడార్ భద్రతకు ముప్పు వాటిల్లిందని ధ్వజమెత్తారు. గతంలో అసోంలోనూ చొరబాటుదారులు ప్రవేశించేవారని.. BJP అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ చొరబాట్లు ఆగిపోయారని వెల్లడించారు. చొరబాటుదారులు తగ్గాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.