మేడారంలో పారిశుధ్యంపై మంత్రి సమీక్ష
MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా పారిశుధ్య నిర్వహణపై మంత్రి దనసరి అనసూయ సీతక్క పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో నేడు సమావేశం నిర్వహించారు. జాతర అనంతరం కూడా మేడారం, రహదారులు, గద్దెల ప్రాంగణాలు, భక్తుల బస ప్రాంతాలు పూర్తిగా శుభ్రం అయ్యే వరకు పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది సేవలను మంత్రి ప్రశంసించారు.