యువతకు వాలీబాల్ కిట్ల పంపిణి

యువతకు వాలీబాల్ కిట్ల పంపిణి

BHNG: భువనగిరి నియోజకవర్గంలోని పహిల్వాన్ పూర్ గ్రామంలో సర్పంచ్ బద్దం కరుణ శ్రీ, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వనగంటి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్ కిట్లను బహుమతిగా గురువారం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. క్రీడా ప్రోత్సాహం ద్వారా యువతలో ఆరోగ్యం, క్రీడా స్ఫూర్తి, సమిష్టి భావన పెంపొందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.