బాచన్నపల్లిలో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

బాచన్నపల్లిలో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

సత్యసాయి: గోరంట్ల మండలం బాచన్నపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, వానవోలు మాజీ సింగల్ విండో అధ్యక్షుడు వెంకటేష్ గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పెనుకొండ టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు గ్రామానికి వెళ్లి, మృతదేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.