'విపత్తు నిర్వహణలో సమన్వయం ముఖ్యం'
KMR: కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ విక్టర్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ టేబుల్‌టాప్ వ్యాయామం నిర్వహించింది. వరదల వంటి విపత్తుల సమయంలో ముందస్తు సిద్ధత, శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందనపై అధికారులు చర్చించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి పక్కా ప్రణాళికలు అవసరమని ఆయన పేర్కొన్నారు.