సూర్య ధన్వంతరి దేవాలయంలో కుంకుమ పూజలు

జగిత్యాల చింతకుంటలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలు అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్రనామా స్థోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం తర్వాత ఒడి బియ్యం సమర్పించారు. ట్రస్ట్ ఫౌండర్ వడ్లగట్ట రాజన్న, వోడ్నాల శ్రీనివాస్, మహిళా సభ్యులు లత, సంధ్య పాల్గొన్నారు.