10.5 కిలోల గంజాయి పట్టివేత

10.5 కిలోల గంజాయి పట్టివేత

SKLM: ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుశాల పురం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన ఈ మహిళలు బెంగళూరుకు గంజాయి తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులకు అందిన సమాచారంతో అరెస్టు చేసినట్లు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం శనివారం తెలిపారు. 10.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.