డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకుడు
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి డ్రైనేజీ నిండుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ రఘు వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం మురుగు నీటిని పూర్తిగా తొలగించి అధికారులతో కలిసి ఆయన సమస్యను పరిష్కరించారు.