వరల్డ్ కప్ ఆడటమే నా డ్రీమ్: జైస్వాల్
టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఆడటమే తన కల అని టీమిండియా యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ తెలిపాడు. అయితే ఓపెనర్లుగా అభిషేక్, గిల్ స్థిరపడిన నేపథ్యంలో ప్రస్తుతానికి తన ఆటపై ఫోకస్ పెడతానని, తన టైమ్ వచ్చే వరకు వెయిట్ చేస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఈ యువ ప్లేయర్.. అవకాశమిస్తే భవిష్యత్తులో టీమిండియాను నడిపిస్తానని పేర్కొన్నాడు.