మచిలీపట్టణంలో హర్గర్ తిరంగా ర్యాలీ

మచిలీపట్టణంలో హర్గర్ తిరంగా ర్యాలీ

కృష్ణా: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు కృష్ణాజిల్లా మచిలీపట్టణం కలెక్టరేట్ కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు జాతీయ జెండాలు చేత బూని సోమవారం హార్గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వదేశీ ఉత్పత్తుల తయారీతో పాటు కొనుగోళ్లు ప్రోత్సహించాలన్నారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తూ ఛాయాచిత్ర ప్రదర్శన, క్విజ్ ఏర్పాటు చేయాలని కోరారు.