అమలాపురంలో పెరిగిన చికెన్ ధరలు

అమలాపురంలో పెరిగిన చికెన్ ధరలు

కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం మాంసం ధరలు పెరిగాయి. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కిలో రూ.280 నుంచి రూ.300లకు చేరింది. అయితే ఫారం కోడి ధర రూ.200గా ఉంది. మటన్ కిలో రూ.800 వద్ద స్థిరంగా కొనసాగుతుండగా... మిగిలిన చేపలు రకాన్ని బట్టి రూ.130 నుంచి రూ.140 మధ్య విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.