విధులు బహిష్కరించిన న్యాయవాదులు

WGL: వరంగల్, హన్మకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం, రంగారెడ్డి న్యాయవాది ఇశ్రాయిల్ మహేశ్వర్ హత్యకు నిరసనగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఆయన హత్యకు బాధ్యులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని బార్ ప్రతినిధులు ప్రభుత్వాలను కోరారు.