కుప్పంలో వ్యక్తి అదృశ్యం

కుప్పంలో వ్యక్తి అదృశ్యం

చిత్తూరు: కుప్పం మండలం వసనాడు పంచాయతీ బిరుదున పల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ ఈనెల 1వ తేదీ నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటవ తేదీ నుండి ప్రకాష్ కనబడకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలు బంధువుల ఇళ్లలో వెతికిన ప్రయోజనం లేకపోయిందని ఆయన సోదరుడు రామచంద్రన్ ఫిర్యాదు చేశారు. ప్రకాష్ ఆచూకీ తెలిస్తే కుప్పం పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.