వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ

'రెట్రో' ప్రీ రిలీజ్‌లో ఆదివాసులపై చేసిన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ స్పందించాడు. ఎవరినీ బాధించడం తన ఉద్దేశం కాదని వెల్లడించాడు. 'నా వల్ల, నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే క్షమించండి. ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నేను మన దేశ ఐక్యత గురించి.. మనం ఎలా ముందుకు సాగాలి అనేదానిపై మాట్లాడాను' అని పోస్ట్ పెట్టాడు.