భగీరథ మహర్షి సేవలు ఆదర్శం: అదనపు కలెక్టర్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బిఎస్. లత భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగీరథ మహర్షి సమాజ హితం కోసం చేసిన సేవలు నేటికీ ఆదర్శమని ఆమె అన్నారు. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి. సునీత, కిషన్, తదితరులు పాల్గొన్నారు.