నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు పట్టణం రామ్మూర్తి నగర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా ఈ అంతరాయం ఏర్పడిందని ఆయన అన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి శాఖ వారికి సహకరించాలని కోరారు.