‘నష్టపరిహారం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా'

MLG: తాడ్వాయిలో నకిలీ మొక్కజొన్న పంట వేసి ఓ రైతు తీవ్రంగా నష్టపోయారు. నర్సాపూర్(పీఏ)కు చెందిన సీతారాములు అనే రైతు 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. పంట చేతికి వచ్చే సమయానికి మొక్కజొన్న పీచు మాత్రమే ఉందని, గింజలు లేవని నకిలీ మొక్కజొన్న ఇచ్చారని.. సింజెంటా షీట్ ఏజెంట్లపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదన్నారు.