నారాయణవనం పోలీసులు గ్రేట్..!

నారాయణవనం పోలీసులు గ్రేట్..!

TPT: వడమాలపేటకు చెందిన లోకేశ్ తిరుపతిలో సత్యవేడు పల్లెవెలుగు బస్సు ఎక్కాడు. వడమాలపేటలో బ్యాగు మరచిపోయి బస్సు దిగాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు నారాయణవనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్ వెంటనే స్పందించి పాలమంగళం వద్ద బస్సు ఆపి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో ల్యాప్టాప్, 16గ్రాముల బంగారం, రూ.7వేలు ఉన్నాయి.