ఆనందపురంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి
VSP: జాతీయ రహదారిపై ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ, జాతీయ రహదారుల సంస్థ, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆనందపురం కూడలిలో పరిశీలించారు. రద్దీ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, పలు సూచనలు చేశారు.