గుంతలమయంగా రేపల్లె-పెనుమూడి రహదారి

గుంతలమయంగా రేపల్లె-పెనుమూడి రహదారి

బాపట్ల: రేపల్లె నుంచి పెనుమూడి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఎన్నో గుంతలు ఉన్నాయని వాహనదారులు అన్నారు. మంచు కురుస్తుండటం వల్ల ఈ గుంతలు కనపడక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నామని వాపోయారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గుంటలు పూడ్చి ఈ సమస్యను పరిష్కరించాలని వాహనచోదకులు కోరుతున్నారు.