అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
KRNL: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం తనిఖీ చేశారు. భోజన నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌లో రుచికరమైన, ప్రమాణాలున్న భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.