అనకాపల్లిలో భారీగా గంజాయి పట్టివేత

AP: అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బొడ్డురేవులో 320 కేజీల గంజాయి పట్టుకున్నట్లు మాడుగుల పోలీసులు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.