వెహికల్ షెడ్‌లో బల్దియా కమిషనర్ ఆకస్మిక తనిఖీ
WGL: చెత్త తరలింపు వాహనాల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బాలసముద్రంలోని వెహికల్ షెడ్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి, సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వాహనాల మరమ్మత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రేక్‌డౌన్ అయిన వాహనాల సమాచారాన్ని కూడా పరిశీలించారు.