ప్రకాశం జిల్లా YCP నాయకుడికి కీలక పదవి

ప్రకాశం: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు YS జగన్ ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా, ప్రకాశం జిల్లాకు చెందిన కాకుమాని రాజశేఖర్ బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. తనమీద నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన జగన్‌కు, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.