ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్న మెస్సీ
HYD: ఫుట్ బాల్ స్టార్ మెస్సీ గ్రీన్ ఛానల్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫలక్ నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి బయలుదేరనున్నారు. కాగా.. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ పాల్గొననున్నారు.