EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
ADB: జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో EVM గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం నెలసరి తనిఖీలో భాగంగా పరిశీలించారు. గోదాంలో భద్రపరిచిన యంత్రాల స్థితి, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా వ్యవస్థ, బ్యారికేడింగ్ వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. EVM- VVPATల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండకూడదన్నారు.