VIDEO: బురదమయంగా మారిన రోడ్డు

VIDEO: బురదమయంగా మారిన రోడ్డు

ప్రకాశం: కంభంలోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ఉన్న విద్యానగర్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది. దీంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు రోడ్డు మరమ్మతులపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపించాలని ప్రజలు కోరుతున్నారు.