’కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర’
NZB: ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల శివార్లలో నేషనల్ హైవేపై రోడ్డును తవ్వి పనులు చేపట్టిన ప్రాంతాన్ని ఇవాళ ఆయన పరిశీలించారు. అక్కడి బ్రిడ్జి మంజూరు అయ్యి రెండేళ్లు కావస్తోన్న పూర్తకాలేదన్నారు.