'రక్తదానానికి యువత ముందుకు రావాలి'
ADB: యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ప్రిన్సిపల్ లక్ష్మణ్ అన్నారు. రూరల్ మండలంలోని తంతోలి గిరిజన డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అందజేసి వారి ప్రాణాలను కాపాడవచ్చునని పేర్కొన్నారు. NSS పీవో శ్రీనివాస్, సిబ్బంది సురేందర్, లక్ష్మణ్ తదితరులున్నారు.