శ్రీశైలం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఈవో
NDL: శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. దర్శనాలు, ప్రసాదాలు, అన్నప్రసాదం సౌకర్యాలు సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎండల దృష్ట్యా చలువపందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందించాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.