'పీఎం జన్మన్ 2.0 లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలి'

'పీఎం జన్మన్ 2.0 లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలి'

ASR: గృహ లబ్ధిదారులకు బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. బలియగూడ పీవీటీజీ గ్రామానికి చెందిన 9 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టినా బిల్లులు రాక పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశంపై పాడేరు ఐటీడీఏలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.