పంట నష్టం నివారణ అధికారులతో కలెక్టర్ సమీక్ష
ELR: జిలాల్లో ఈనెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పంట నష్టం నివారణ చర్యలపై అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ప్రస్తుతం కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు.