కడప అమీన్ పీర్ దర్గాను దర్శించిన రాకసా మూవీ టీం
కడప అమీన్ పీర్ దర్గాను రాకసా మూవీ టీం దర్శించుకుంది. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ప్రొడ్యూసర్ కొణిదల నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నైన్ సారిక, నటుడు గెటప్ శ్రీను దర్గా విశిష్టతను తెలుసుకున్నారు. సినిమా విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. భక్తులతో కలిసి కొంతసేపు గడిపి ఆశీర్వాదాలు పొందారు. స్థానికులు మూవీ టీంను ఆత్మీయంగా స్వాగతించారు.