'వారణాసిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి'

SKLM: టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు మాధురి సోమవారం ఉదయం వారణాసిలోని కాశీ విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఇరువురు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసారు.