' శ్రావణ మాసంలో తగ్గిన దేవస్థాన ఆదాయం'

BHPL: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానానికి ఈ శ్రావణమాసంలో ఆదాయం తగ్గినట్లు ఆలయ అధికారులు శనివారం తెలిపారు. ఈ ఏడాది రూ.38.60 లక్షల ఆదాయం సమకూరగా, గతేడాది రూ.52 లక్షలు వచ్చినట్లు తెలిపారు. మే నెలలో జరిగిన సరస్వతి పుష్కరాలకు భక్తులు అధికంగా రావడం శ్రావణమాస ఆదాయంపై ప్రభావం చూపినట్లు వెల్లడించారు.