యువగళ హామీ నెరవేర్చిన ప్రభుత్వం: ఎమ్మెల్యే
యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. ఉగాది సందర్భంగా మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు ఆశాకిరణమన్నారు. యువగళంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.