ఈ రోడ్డులో ప్రయాణం ఎట్లా?

ఈ రోడ్డులో ప్రయాణం ఎట్లా?

VKB: బంట్వారం మండలం మాద్వాపూర్ నుంచి బుగ్గాపూర్ రోడ్డు కత్తి మీద సాముగా మారిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ప్రయాణం ప్రమాదకరం కావడం వలన ఇప్పటికే ఇద్దరు ముగ్గురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అధికారులకు విన్నవించినా, వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రాణనష్టం జరగకముందే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.